మురగదాస్ మూవీలో ప్రభాస్..  - MicTv.in - Telugu News
mictv telugu

మురగదాస్ మూవీలో ప్రభాస్.. 

September 6, 2017

ప్రభాస్ ‘ సాహో ’ తర్వాత.. మురగదాస్ సినిమా చేస్తున్నాడట. ఒక సందర్భంలో మురగదాస్ ప్రభాస్ ను కలిసి కథ చెప్పడం, అది తనకు నచ్చడం జరిగాయట. ప్రభాస్ కూడా కథ బాగుండటంతో వెంటనే చెయ్యటానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. మహేష్ తో చేస్తున్న ‘ స్పైడర్ ’ మూవీ కంప్లీట్ అవగానే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మురగదాసే ప్రకటిస్తాడట. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మంచి ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నాడు. బాహుబలి సినిమా ద్వారా తనకొచ్చిన దేశవ్యాప్త గుర్తింపును కాపాడుకునే దిశలోనే మురగదాస్ సినిమాకు గ్రీన్ సిగ్నలిచ్చినట్టున్నాడు.