కదులుతున్న బస్సులో హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

కదులుతున్న బస్సులో హత్య..

November 24, 2017

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు స్కూల్ యూనిఫాంలో ఉన్న కొందమంది యువకులు.  ఢిల్లీలోని మధుర రోడ్డులో ఓ ప్రయాణికుడితో పాటే  కొంతమంది  విద్యార్థులు బస్సు ఎక్కారు. అయితే  బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ ప్రయాణికుడి ఫోన్ మాయం అయ్యింది.  వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు పక్కనే ఉన్న విద్యార్ధులను  ‘నా ఫోన్ కనపడిందా’  అని అడిగాడు. వాళ్ల బ్యాగులు సోదా చేశాడు. అంతే కోపంతో ఊగిపోయిన  విద్యార్థులు కత్తితో అతని మెడలో పొడిచారు. దీనితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం గమనించిన ఆ దుండగులు  వెంటనే  బస్సు దిగి పరారయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వాళ్లు నిజంగానే  విద్యార్థులా ? లేకపోతే  పాత కక్ష్యలు ఏమైనా ఉండి  విద్యార్థుల ముసుగులో హత్య చేశారా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.