జగిత్యాలలో కులహత్య..! - MicTv.in - Telugu News
mictv telugu

జగిత్యాలలో కులహత్య..!

March 14, 2018

కూతురు వేరే కులంవాడిని  ప్రేమించదనే కక్షతోనే అతన్ని చంపేశారా? లేక అతని హత్యకు వేరే కారణాలు ఉన్నాయా?  జగిత్యాలలో జిల్లా మేడిపల్లిలో ఓ వ్యక్తిని కొడవలితో దారుణంగా నరికి చంపారు. రాగుల సురేష్ అనే వ్యక్తి తహశీల్ధార్ కార్యలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఎప్పటిలాగే  ఆఫీసుకు బయలు దేరాడు. ఇంతలో వెనకనుంచి వచ్చిన ఇద్దరు అతన్ని నరికి చంపారు. వారిద్దరూ అతనికి బంధువులు అవుతారట.సురేష్ కొద్ది రోజుల క్రితమే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమను అమ్మాయి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. ఈక్రమంలోనే  అమ్మాయి తండ్రి, అన్న సురేష్ ను నరికి చంపారని వార్తలు వస్తున్నాయి. అయితే సురేష్‌కు అంతకు ముందే వివాహం అయ్యిందా? ఆ కారణంగానే చంపేశారా ? లేక  కూతురు ఓ దళిత యువకుడిని ప్రేమించిందనే అక్కసుతో చంపారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.