హనుమాన్ గుడిని కట్టిస్తున్న ముస్లిం ! - MicTv.in - Telugu News
mictv telugu

హనుమాన్ గుడిని కట్టిస్తున్న ముస్లిం !

February 6, 2018

500ఏళ్ల  పురాతన గుడి శిథిలావస్థకు చేరడం చూసి గుజరాత్‌లో ఓ ముస్లిం చలించిపోయాడు. తన సొంత ఖర్చుతో ఆ గుడిని పునర్నిర్మిస్తున్నాడు. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ‘భిడ్ భంజన్ హనుమాన్’ గుడిని మొయిన్ మెమన్  అనే ముస్లిం చిన్నప్పటి చూస్తూ  ఆ పరిసర ప్రాంతాల్లోనే పెరిగాడు. కళ్లముంది గుడి శిథిలావస్థకు రావడం చూసి తట్టుకోలేకపోయాడు.

ఎవరేమనుకున్నా సరే గుడికి మళ్లీ పూర్వ వైభవం తేవాలనుకున్నాడు. గుడి నిర్మాణానికి పూనుకున్నాడు. అయితే మతంతో సంబంధంలేకుండా  ఇంత మంచి పనికి పూనుకున్న అతనిని అందరు మెచ్చుకుంటున్నారు.