రాజస్థాన్లో వినయ్ అనే 18 ఏళ్ల కుర్రాడు.. 45 ఏళ్లున్న ఓ ముస్లిం వ్యక్తిపై దాడి చేశాడు. ‘జైశ్రీరామ్ అను.. లేకపోతే చంపేస్తా..’ అని బెదిరిస్తూ అతన్ని 25 సార్లు చెంప దెబ్బలు కొడుతూ, బండబూతులు తిడుతూ అతనిపై దాడి చేశాడు.
నన్ను ఎందుకు కొడుతున్నావ్ అని ముస్లిం అయిన మహ్మద్ సలీం పలుమార్లు అతన్ని అడగ్గా… ముందు నువ్వు జై శ్రీరావ్ అను అని అతన్ని వినయ్ చితకబాదాడు. ముస్లిం వ్యక్తిని కొడుతున్న వినయ్..తనే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త వైరల్ అయ్యింది.
ఈవీడియోను చూసిన ముస్లిం మత పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈవీడియోలో.. నీది కాంగ్రెస్ సర్కార్…నేను హిందూ వర్స్ మనిషిని అంటూ వినయ్ అతన్ని కొట్టాడు. గతంలో కూడా రాజస్థాన్ లో లవ్ జిహాద్ పేరుతో ఓ ముస్లిం యువకుడిని కొట్టి పెట్రోల్ పోసి చంపేసిన సంగతి తెలిసిందే.