సిమ్ములకు ఆధార్ తప్పనిసరి - MicTv.in - Telugu News
mictv telugu

సిమ్ములకు ఆధార్ తప్పనిసరి

September 11, 2017

ఫిబ్రవరి 2018 వరకు సిమ్ కార్డులకు ఆధార్ ను అనుసంధానం చేసుకోకపోతే  సిమ్ కార్డ్ డీఆక్టివేట్ అయిపోతుందంటోంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం తప్పకుండా ఆధార్ లింక్ చెయ్యాల్సిందేనంటోంది.  

ఇప్పటికే దాదాపు సిమ్ కార్డు వినియోగదారులందరికీ మెసేజ్ ల రూపంలో సమాచారం వెళ్ళిపోయింది. షాపుల వాళ్ళు కూడా రీఛార్జ్ కోసం ఎవరొచ్చినా వాళ్ళ నుంచి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని తీసుకోవాలనే ఆదేశాలున్నాయి. ఇప్పుడుదాదాపు  ప్రతీ ఒక్కరు రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారు. కాబట్టి ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఈ చర్య తప్పనిసరి అంటోంది ప్రభుత్వం.