గుండెలను పేల్చేసిన ప్రియ - MicTv.in - Telugu News
mictv telugu

గుండెలను పేల్చేసిన ప్రియ

February 14, 2018

ప్రియా ప్రకాశ్ వారియర్..  ఇప్పుడు ఎవ్వర్ని కదిపినా ఇదే నామజపం. కళ్ళతో కూడా ఇంత చక్కగా మాట్లాడొచ్చా చాలా మంది కుర్రాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ మలయాళీ కుర్రది. ‘ ఒరు ఆదార్ లవ్ ’ సినిమాకు సంబంధించిన మరొక చిన్న టీజర్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఇందులో ప్రియా తన లవర్‌కు ఫ్లయింగ్ కిస్‌ను గన్‌లో పెట్టి పేలుస్తుంది.

అబ్బాయి ఒక్కసారిగా బుల్లెట్ కిస్ గాయానికి కింద పడిపోయినట్టుగా నటిస్తాడు. ఇదిప్పుడు మళ్ళీ ట్రెండింగ్ వీడియోగా మారిపోతోంది. ఈమె కళ్ళతో పలుకుతున్న హావాభావాలను చాలామంది ఫాలో అవుతున్నారు. ఆమెలా కళ్ళతో మెస్మరైజ్ చెయ్యాలని ట్రై చేస్తున్నారు.

ఇంకా సినిమానే విడుదల కాలేదు.. చిన్న టీజర్ల ద్వారా ఈ పిల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ లెక్కన సినిమాల్లో నటించి అవి విడుదలయ్యాక సన్నీ లియోని, సైరాట్ హీరోయిన్లకు క్రేజ్ వచ్చింది. కానీ ప్రియా కేవలం టీజర్లతోనే స్టార్ అయిపోయింది.

వాళ్ళ కన్నా ఈమే గొప్పదని ఆమెను అభిమానిస్తున్నవాళ్ళంతా అంటున్నారు. మరి పూర్తి సినిమాలో ఇంకెన్ని జిమ్మిక్కులు చేసిందో చూడాలంటున్నారు ప్రేక్షకులు. ఈ అమ్మాయి మోహినీయాట్లం డాన్సర్ అవడంతో కళ్ళతో హావాభావాలు చాలా ఈజీగా పలికిస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.