mictv telugu

ఏంటీ మీ బ్లడ్, బ్రీడ్? బాలయ్యకు నాగబాబు కౌంటర్

January 8, 2019

అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారని నటుడు బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారని బాలయ్య అనడంతో నాగబాబు సీరియస్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ‘సినిమాల్లో రాణించినంత ఈజీగా రాజకీయాల్లో రాణించలేరు. అది ఒక్క ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. ఓ గొప్ప పొలిటీషన్‌ను ఓడించడం తప్పితే ఏం చేశాడు. పార్లమెంటులో ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి పనికొచ్చాడు తప్పితే ఏం చేశాడు? చిరంజీవి కూడా వచ్చి ఏం చేశాడు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య.Telugu news Naga Babu about Balakrishna Blood and Breedదీంతో నాగబాబు ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఎవరినైనా విమర్శించవచ్చు తప్పులేదు. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు అన్నారు. ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో అమితాబ్ బచ్చన్ కూడా అంతపెద్ద స్టారే. ఆయనను అలా అనడం చాలా బాధ అనిపించింది. తర్వాత చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్‌లో మా అన్నయ్య పేరు అవసరమా మీకు? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మాట్లాడారు. ఏంటీ మీ బ్లడ్, బ్రీడ్ వేరు? మీరేమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా? లేకపోతే మీరేమైనా మహారాజ సూర్యవంశీకులా? బ్లడ్, బ్రీడ్ మనుషులు చూస్తారా అసలు ? ఎక్కడో ఆస్ట్రియా, ఇగ్లాండ్‌లో అరిస్టో క్రాస్ట్ ఫ్యామిలీస్ బ్లూ బ్లడ్ అని చెప్పారు. అప్పుడు సామాన్య ప్రజల్లో రివల్యూషన్ వచ్చి వాళ్ళను తొక్కేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారు. మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా? బాలకృష్ణను అభిమానించేవాళ్లు ఆయన కామెంట్లను ముందు తెలుసుకోండి’ అంటూ మండిపడ్డారు.

బాలయ్య నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మీరేదో దైవాంశ సంభూతులు కారు, మీరూ మాలాగే తల్లిదండ్రులకు పుట్టారని అన్నారు. అత్యంత సాధారణ కుటుంబాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చారు.. మీరొక్కరే కాదని చెప్పారు. ఒక్కోసారి ఫెయిల్ అయుండొచ్చు.. ఒక్కోసారి మేము సక్సెస్ అయుండొచ్చు. అలా అని ఎప్పటికీ సక్సెస్ వుండదు కదా అన్నారు. ఎన్టీఆర్‌ను మీ బావ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ బ్రీడ్, బ్లడ్ ఏమైందని ఘాటుగా ప్రశ్నించారు.  Telugu news Naga Babu about Balakrishna Blood and Breed