నాగబాబు మానవత్వం ముసుగు వేసుకున్నారు.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నాగబాబు మానవత్వం ముసుగు వేసుకున్నారు.. శ్రీరెడ్డి

April 18, 2018

నటుడు నాగబాబు వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించింది. ‘ నాగబాబు గారు గొప్ప మానవతా వాది అనుకుంటున్నట్టున్నారు. ఎంత దయనీయంగా మాట్లాడారు. ఆడపిల్లలు అంటే మీకు రెస్పెక్ట్ లేదు. మానవత్వం ముసుగు వేసుకున్నారు మీరు ? మీరు ఈ ప్రపంచంలోనే చాలా పర్‌ఫెక్ట్ మనిషిని అనుకుంటున్నట్టున్నారు. అది ఓ సైక్ర్యార్టిస్ట్ డాక్టర్ చెప్తాడు. మీరు అడిగిన ప్రతీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను వేచి చూడండి సర్.. ’ అంటూ పోస్ట్ పెట్టింది.అలాగే మరో పోస్టులో తన ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేసింది. నేను పిరికిదాన్ని కాను. నా జీవితంలోని మంచి చెడులను దాచుకోకుండా నేను బాహటంగానే చెప్పాను. నేను మనిషినే.. నాలో మంచి చెడులు వుంటాయి కదా అంది. ఈ పోరాటంలో గెలుపో ఓటమో చవిచూసే వరకు వెనక అడుగు వేయనని చెప్పుకొచ్చింది. పవన్ అన్నట్టు నేను లీగల్‌గా వెళ్తానని చెప్పింది. ఇందులో ముందుగా జీవితా రాజశేఖర్ గారి లీక్స్ బయట పెడతానని తెలిపింది.