పెళ్లితో ఒక్కటైన చై, సాము 

హీరో నాగ చైతన్య, అందానికే అందమైన  సమంత ప్రేమపక్షులుగా పయనం ప్రారంభించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గోవాలోని ఓ రిసార్టులో  శుక్రవారం రాత్రి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది.  బంధువులు, స్నేహితులు , కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఇప్పడు పెళ్లి ఫోటోలను నాగార్జున తన ట్విటర్ లో ఫోస్ట్ చేశాడు.

సంప్రదాయంగా సాగిన పెళ్లిలో ప్రతి సందర్బంలో కొత్త జంట ఆనందంలో  మునిగిపోయారు. చై, సాము హ్యాపినెస్ ఇప్పుడు అఫిషియల్ అంటూ నాగ్ ట్విట్ చేశాడు. ఈరోజు.. అంటే.. శనివారం 5 గంటల 30 నిమిషాలకు గోవాలోనే  క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈ వివావానికి తెలుగు,తమిళ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటినటులతో పాటు 100 మంది హాజరు కానున్నారు