రిసెప్షన్ కూడా రెండుసార్లు

టాలీవుడ్ హీరో నాగచైతన్య , హీరోయిన్ సమంత  కొన్నాళ్లు రోజూ వార్తాల్లో నిలుస్తూనే ఉన్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఈ జంట రిసెప్షన్‌ను కూడా రెండుసార్లు ఇవ్వనుంది. ముందుగా నాగచైతన్య తల్లి లక్ష్మి.. చెన్నై‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.. దగ్గుబాటి, అక్కినేని, సమంతల కుటుంబసభ్యలు మాత్రమే హాజరు కానున్నారని టాక్. ఇక హైదరాబాద్‌లో సమంత మామ నాగార్జున రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నాడు.

కుబుంబసభ్యులతో పాటు, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన నటీనటులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. సమంత, చైతూలు కొంచం ఫ్రీ అయ్యాక రిసెప్షన్ ఉంటుందని నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సామ్, చైతూల పెళ్లి ఈనె 6న గోవాలో జరగడం తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి, సమంతల కుటుంబసభ్యులతో పాటు 100 మంది సన్నిహితుల మధ్య జరిగింది. అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది.