‘ఫిదా’..  సాయి పల్లవి వల్లే హిట్ కాలేదు ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఫిదా’..  సాయి పల్లవి వల్లే హిట్ కాలేదు !

February 7, 2018

ఫిదా ’ పిల్ల కొన్ని తగాదాల్లో ఇరుక్కుంటోంది. ‘ ఎంసీఏ ’ సినిమా చేస్తున్నప్పుడు హీరో నానీతో ఆమెకు గొడవలయ్యాయని వార్తలొచ్చాయి. దాని మీద నాని స్పందించలేకపోయేసరికి గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఇంకో హీరోతో తగాదా తెరమీదకొచ్చింది. తాజాగా సాయిపల్లవి ప్రవర్తనపై యువ హీరో నాగశౌర్య బహిరంగంగా మీడియాలో కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

నాగశౌర్యతో కలిసి తమిళంలో కరు ( తెలుగులో కణం ) చిత్రంలో సాయిపల్లవి నటించింది. ఈ చిత్రం షూటింగ్ దశలో వుండగా సాయిపల్లవికి, నాగశౌర్యకు విబేధాలు తలెత్తాయట. దాని గురించి నాగశౌర్య ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ తనకూ నాకు విభేదాలంటే.. షూటింగ్‌కు లేటుగా రావటం, తోటి నటుణ్నినని కూడా చూడకుండా పొగరుగా వ్యవహరించేది. నా కెరీర్‌లో చాలా మంది అందగత్తెలను, టాలెంటెడ్ యాక్టర్లను చూశాను.  వాళ్లను చూసి నేనెప్పుడూ జెలసీగా ఫీలవ్వలేదు. కానీ సాయిపల్లవిని చూసి ఈర్ష్యగా కంటే దూకి చచ్చిపోవాలనుంది. ఇది నేను ఆమెకొచ్చిన క్రేజ్‌ను చూసి జెలసీగా ఫీలై చెప్పటం లేదు ’ అని చెప్పాడు.

తాజాగా దక్షిణాదిలోని ఓ టాప్ టెలివిజన్‌తో నాగశౌర్య మాట్లాడుతూ ‘ కరు చిత్ర షూటింగ్ సమయంలో చిన్న చిన్న విషయాలకు సాయి పల్లవి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. తన ప్రవర్తన నాకస్సలు నచ్చలేదు. ఫిదా సినిమా తనొక్కరి వల్లే హిట్టవలేదు. అది సమిష్టి కృషి వల్లే హిట్టయింది ’ అని నాగశౌర్య అన్నట్లు  ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కాగా నాగశౌర్య తనపై గతంలో, ఇప్పుడు చేసిన కామెంట్లపై సాయి పల్లవి ఇంతవరకు నోరు విప్పలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మళయాలం సినిమాలతో బిజీగా వున్నది సాయిపల్లవి.