‘హలో’ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం..ఇది  ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

‘హలో’ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం..ఇది  ఫిక్స్

December 10, 2017

ఆదివారం విశాఖపట్టణంలో   అక్కినేని అఖిల్ ‘హలో’ ఆడియో రిలీజ్ జరిగింది. ఈ సందర్భంగా  నాగార్జున మాట్లాడుతూ ‘ అక్కినేని ఫ్యాన్స్‌కి.. అఖిల్‌కి ప్రామిస్ చేశా హిట్ ఇస్తా అని, తప్పకుండా ఇస్తున్నా….‘హలో’తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం ఇది ఫిక్స్.

పోయిన సంవత్సరం  ప్రామిస్ చేశా …నాగచైతన్యతో హిట్ కొడతాం అని ‘రారండోయ్ వేడుక చేద్దాం’తో అలా హిట్ కొట్టాం.  ఇప్పుడు ప్రామిస్ చేస్తున్న ‘హలో’ సినిమాతో తప్పక హిట్ కొడతామని’ అని  నాగ్ ధీమా వ్యక్తం చేశారు.  గతంలో నాగార్జున కుటుంబంతో ’ మనం‘ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కుమార్  ఈ అఖిల్ ‘హలో’ కు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22 న ఈ ‘హలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.