నాగ్ నాకోసం తన్నులు పక్కన పెట్టు.. ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

నాగ్ నాకోసం తన్నులు పక్కన పెట్టు.. ఆర్జీవీ

February 24, 2018

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ,హీరో నాగార్జునను వేడుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. ‘మిమిల్ని గర్వపడేలా చేయకపోతే నిజంగా నన్ను తన్నండి. అందుకు సినిమాలో విలన్స్ కోసం వినియోగించే తన్నులను నా కోసం ఉంచండి ’ అని ట్వీట్ చేశాడు.  ఆ ట్వీట్‌కు స్పందించిన నాగార్జున ‘ సినిమాకు సంబంధించి కేవలం యాక్షన్, క్లైమాక్స్ మాత్రమే  మిగిలి ఉంది. వర్మ ఉత్సాహాన్ని చూడాలని చాలా ఆత్రుతగా ఉందని ’ ట్వీట్ చేశాడు.

నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మైరా సరీన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర పేరును ,ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు.

కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ గన్‌ ’, ‘ సిస్టమ్‌ ’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ శివ ’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మ – నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.