నాకొడుక్కి బ్రతికే అర్హతలేదు: రాజేశ్ తల్లి - MicTv.in - Telugu News
mictv telugu

నాకొడుక్కి బ్రతికే అర్హతలేదు: రాజేశ్ తల్లి

December 14, 2017

మనసు-మమత సీరియల్ ను ఆదర్శంగా తీసుకుని  భర్తను చంపిన స్వాతి ప్రియుడు రాజేశ్‌ను నాగర్ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న రాజేశ్‌ ను ఆసుపత్రిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. సుధాకర్‌రెడ్డి హత్య కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు రాజేశ్‌ను వివిధ కోణాల్లో విచారించనున్నారు పోలీసులు. 
సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని, స్వాతికి భర్త సుధాకర్‌రెడ్డి అంటే ఇష్టం లేదని…అందుకే హత్యకు ప్లాన్ చేశామని చెప్పాడు. మరోవైపు స్వాతిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

రాజేశ్ తల్లి ఏమందంటే…

ఒక మనిషిని చంపిన  నాకొడుకుకు ఈ భూమ్మీద బ్రతికే  అర్హతలేదు. అసలు వాడు నాకు పుట్టలేదు అనుకుంటాను. ప్లీజ్ వెంటనే వాడిని చంపేయండి. నాకొడుకు ఇలా తయారవుతాడని తెలిస్తే ముందు నేనే వాన్ని చంపేసేదాన్ని. మీరు చంపకపోతే వాన్ని నాకప్పగించండి నేనే వాన్ని చంపేసి మీముందుకు వస్తానని రాజేశ్ తల్లి మీడియాతో చెప్పింది.