హృదయాన్ని దోచుకుంది.. పోలీసులకు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

హృదయాన్ని దోచుకుంది.. పోలీసులకు ఫిర్యాదు

January 8, 2019

ప్రేయసీప్రియుళ్లు ఒకరి మనసు ఒకరు దొంగిలించడం, దోచుకోవడం, ఎదలోపల పదిలంగా దాచుకోవడం తెలిసిందే. అయితే ఓ కుర్రాడు ఇది నిజమైన చోరీ వ్యవహారమే అనుకుని లబోదిబోమన్నాడు. తన ప్రేయసి తన హృదయాన్ని చోరీ చేసి, హ్యాండిచ్చిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. చోరీపై ఎఫ్ఐఆర్ నమోద చేయాలని మంకుపట్టుపట్టాడు. మహారాష్ట్ర నాగపూర్ ఈ తతంగం జరిగింది.

Nagpur man approaches cops to find his stolen heart police rejected as no laws regarding this issue.

‘మా వద్దకు ఎన్నో కేసులు వస్తుంటాయి. మనసు దోచుకున్నట్లు వచ్చిన కేసు మాత్రం ఇదొక్కటే. ఒక యువకుడు తన హృదయాన్ని పోగొట్టుకున్నానని, వెతికి తిరిగి తనకు అప్పగించాలని కోరాడు. మాకు అనుమానం వచ్చింది. ఇలాంటి కేసులు గతంలో ఏమైనా ఉన్నాయా అని ఉన్నతాధికారులను అడిగాం. అలాంటిదేమీ లేదని, హృదయాల దొంగతనంపై మన చట్టాల్లో ఏమీ రాయలేదని అతనికి నచ్చజెప్పి పంపాం.. ’ అని నగర పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ్ విలేకర్లకు వెల్లడించారు. తాము ఇటీవల రూ. 82 లక్షల విలువైన వస్తువలను దొంగల నుంచి స్వాధీనం చేసుకుని, సొంతదారులకు అప్పగించామన్నారు. వాటిలో హృదయం వంటిదేమీ లేదన ఛలోక్తి విసిరారు. telugu news Nagpur man approaches cops to find his stolen heart police rejected as no laws regarding this issue