ఊరికి మొత్తం దురద పెట్టింది! - MicTv.in - Telugu News
mictv telugu

ఊరికి మొత్తం దురద పెట్టింది!

February 3, 2018

ఒకరు కాదు ఇద్దరు కాదు ఊరు ఊరు మొత్తం దురదకు బలి అయ్యింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో ప్రజలంతా ఒళ్లంతా దురదలు పుట్టడంతో బాబోయ్ దురదలు అని గోక్కుంటూ కూర్చున్నారు. దీనికి కారణం క‌లుషిత‌మైన నీటిని తాగ‌డమే కారణం.ఒక్క దురదలే కాదు వాంతులు, విరేచ‌నాలు, తలనొప్పి వంటి అనారోగ్యాల బారిన కూడా పడ్డారు.  ఇటీవ‌ల‌ నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి అయిన నీటిని రివర్స్‌ పంపింగ్ చేశారు. అయితే, ఆ నీళ్లు టెయిల్‌పాండ్‌లోకి వచ్చి నిల్వ ఉండడంతో ఈ విష‌యాన్ని గుర్తించ‌క‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు శుద్ధి చేయకుండానే నేరుగా చింతలపాలెం, నాయకునితండాల్లోని వాటర్‌ప్లాంట్‌కు స‌ర‌ఫ‌రా చేశారు. దీనితో ఆ నీటిని తాగిన ప్రజలు బీమారీలతో  ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.