నల్లారి కిరణ్‌పై చంద్రబాబు దిల్ - MicTv.in - Telugu News
mictv telugu

నల్లారి కిరణ్‌పై చంద్రబాబు దిల్

November 24, 2017

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘ కిరణ్ గొప్ప నాయకుడు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో గట్టిగా పోరాడారు ’ అంటూ పొగిడారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు అమర్ నాథ్ రెడ్డిలు తేదేపాలో చేరిన సందర్భంగా చంద్రబాబు పై విధంగా స్పందించారు. టీడీపీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  కిశోర్ కుమార్‌ను పీలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘ నల్లారి కిశోర్ రెడ్డి నేను కలిసి చాలా కాలం పని చేశాం. కిశోర్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యం, చిత్తూరు రాజకీయాల గురించి తనకు తెలియంది కాదు. రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండి గట్టిగా పోరాడారు. సోనియా, జగన్‌లు కుమ్మక్కై అన్యాయంగా రాష్ట్ర విభజనకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుటుంబం నల్లారి కుటుంబం. నల్లారి కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నల్లారి కుటుంబం పీలేరు నియోజకవర్గానికి ఎంతో అవసరం ’ అని చంద్రబాబు వివరించారు.