నామా.. ఓ కామాంధుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

నామా.. ఓ కామాంధుడు..

October 28, 2017

టీడీపీ మాజీ ఎంపీ నామాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు సుజాత మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. అతడు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని, వారిని వాడుకుని వదిలేస్తాడని ఓ టీవీ చానల్‌తో చెప్పింది.

‘నామా పెద్ద బ్లాక్ మెయిలర్. ఎవరైనా తన మాటను కాదంటే వాళ్ళను బెదిరించి ఆయనకు లొంగిపోయేలా చేస్తాడు. నా నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న నామా మహిళలతో అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తాడు.. నామా ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యల బొమ్మలున్నాయి. నామా నా భర్తకు కూడా బాగా తెలుసు. నామాతో నాకు నువ్వునువ్వు  అని మాట్లాడుకునేంత సాన్నిహిత్యం వుంది. కానీ మధ్యలో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయమే నేను అడిగినందుకు నా వీడియోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. పైగా నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నాడు.  ఈ కేసు వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని రౌడీ షీటర్లతో బెదిరిస్తున్నాడు’ అని సుజాత చెప్పింది.

‘2013 నుండి అతడు మా ఇంటికి వస్తున్నాడు. ఆయనే బ్లాక్ మెయిలర్ అయివుండి నన్ను బ్లాక్ మెయిలర్ అంటూ నా మిత్రుల దగ్గర అవాకులు చెవాకులు చేస్తున్నాడు. మోత్కుపల్లి నర్సింహులుతో ఫోన్ చేయించి, కేసు విత్ డ్రా చేసుకుంటానని ఒక్క వాక్యం మెయిల్ పెట్టమన్నాడు అని ఆమె  తెలిపారు. ‘నేను ఫోన్ చేస్తే మాట్లాడే అవసరం లేదన్నాడు. అతని నిజస్వరూపంపై చంద్రబాబునాయుడు పీఏకి కూడా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు నేను ఎవరి బెదిరింపులకూ లొంగను’ అని సుజాత స్పష్టం చేశారు.