తాజ్ వద్ద నమాజునూ నిషేధించాలి... - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్ వద్ద నమాజునూ నిషేధించాలి…

October 27, 2017

తాజ్ మహల్ దగ్గర నమాజును నిషేధించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS ) డిమాండ్ చేసింది. అక్కడ నమాజులు చేయడానికి అనుమతిస్తే శివపూజలు కూడా చెయ్యటానికి కూడా  అనుమతించాలని వాదిస్తోంది.

తాజ్ దగ్గర ప్రతీ శుక్రవారం నమాజు నిర్వహించడం ఆనవాయితీగా సాగుతున్నది. అయితే వారసత్వ సంపదకు చిహ్నం అయిన తాజ్‌ను మతపరమైన ప్రదేశంగా ఎందుకు మార్చరని ప్రశ్నిస్తోంది. సోమవారం హిందూ సంఘాలకు చెందిన ఇద్దరు తాజ్ వద్ద ఈశ్వర్ చాలీసా చదివి హల్ చల్ చేయడం, భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి తరిమేయడం తెలసిందే.