లేడికూనపై మృగరాణి ప్రేమ - MicTv.in - Telugu News
mictv telugu

లేడికూనపై మృగరాణి ప్రేమ

February 19, 2018

ఎలుకకు పిల్లికి మధ్య శత్రుత్వం.. పిల్లికి కుక్కకు మధ్య పగ.. సృష్టిలో ఇలాంటివెన్నో. అయితే ఓ ఆడసింహం.. తన ఆహారంతో ప్రేమలో పడిపోయింది. ఓ లేడికూనను తన కన్నబిడ్డలా సాదుకుంటోంది. ఆ జింకపిల్లపై ఎనలేని వాత్సల్యం చూపుతోంది.  ఈ వింత.. నబీబియాలోని ఈటోొషా జాతీయ అభయారణంలోనిది.ఈ మృగరాణికి కొన్ని పిల్లలు ఉండేవి. అయితే అడవిపై ఆధిపత్య పోరులో కొన్ని మగసింహాలు ఆ పిల్లలను చంపేశాయి. ఈ ఘటనతో తీవ్ర మానసిక ఒత్తిడికి, బాధకు గురైన ఆడ సింహం ఒంటరిగా తన కంట పడిన జింక పిల్ల చేరదీసి రక్షిస్తోంది. వీటి ఫొటోలు అమెరికా ఫొటోగ్రాఫర్ గార్డన్‌ డొనోవాన్‌ తన కెమెరాలో బంధించారు. సింహాల ఫొటోలు తీయడం తనకు ఇష్టమని గార్డన్‌ చెప్పారు. ‘సింహం మొదట జింక పిల్లను చంపుతుందేమో అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఆ సింహం.. లేడిపిల్లతో ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోయాను..’ అని4 చెప్పింది గార్డన్.