నమిత, శరత్‌బాబు పెళ్లాడబోతున్నారు..!

హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత అవకాశాలు లేక ఐటం గర్ల్ గా ఓ వెలుగు వెలిగిన నటి నమిత. కొన్నాళ్లుగా సినిమాల్లేని  నమిత  సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో ప్రేమలో ఉందనే వార్త  కోలివుడ్‌లో చక్కర్లు కొడుతుంది. నమిత ఈ మధ్యే కమల్ హాసన్ హోస్ట్‌గా చేసిన తమిళ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. ఆ మధ్య రాజకీయాల్లోకి వస్తానంటూ హడావుడి కూడా చేసింది. అయితే ఇంత వరకు ఏ పార్టీలో కూడా ఆమె చేరలేదు. తమిళనాడు తంబీలు ఖుష్బూ తర్వాత  నమితకు కూడా గుడి కట్టి ఆరాధించారు. కానీ ఇపుడు 36 ఏళ్ల నమితి తన తండ్రి వయసున్న శరత్ బాబు(66)తో  ప్రేమలో పడటాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పటకికే రమాప్రభ, మరో నటిని పెళ్లికేసుకుని విడాకులు తీసుకున్న శరత్ బాబు  మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  తానిప్పుడు మూడో రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తున్నానని, ఆమె ఒక హీరోయిన్ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. శరత్ బాబు, నమితతో సన్నిహితంగా మెలుగుతుండడంతో ఆ హీరోయిన్ నమితేనని  అందరూ అనుకుంటున్నారు.

SHARE