నాని పారితోషికం 6 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

నాని పారితోషికం 6 కోట్లు 

October 31, 2017

హీరో నాని సినిమా అంటే చాలు, మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. తన నేచురల్ నటనతో నేచురల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో నిర్మాతలు కూడా అతనికి ఎంతైనా ఇవ్వడానికి వెనకాడడంలేదు.

 నాని ఇప్పుడు ఒక్కో సినిమాకి 6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో నాని నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒక్కో సినిమాకు 6 కోట్లు అంటే మూడు సినిమాలకు 18 కోట్లు, ఈ లెక్కన చూసుకుంటే.. స్టార్ హీరోలు ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారో, నాని కూడా అదే రేంజ్‌లో సంపాదిస్తున్నాడు.  ప్రస్తుతం నాని నటిస్తోన్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’(ఎంసీఏ) డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.