చెత్త వార్తలు రాసి నాకు ట్యాగ్ చెయ్యకండి..ప్లీజ్! - MicTv.in - Telugu News
mictv telugu

చెత్త వార్తలు రాసి నాకు ట్యాగ్ చెయ్యకండి..ప్లీజ్!

March 2, 2018

కొన్ని మీడియా సంస్థల గురించి  అందరికి తెలిసిందే.  పలానా హీరో, హీరోయిన్లు  తుమ్మితే చాలు  ‘బ్రేకింగ్ న్యూస్  ఫలానా సెలబ్రిటీ తుమ్మితే  రక్తం పడింది’ అని రాసే రకం.  ఉన్నది ఉన్నట్లు వార్త ఇస్తే  ఏం కిక్కుంటుంది. అని దానికి కాస్త మసాలా జోడించి రాస్తుంటారు. ఇచ్చే వార్తలో ఎంత నిజముందో  అని పట్టించుకుకోరు. పబ్లిక్ కు  కనెక్ట్ అయ్యిందా లేదా అనేదే చూస్తారు.

ఓ ప్రముఖ మీడియా సంస్థ కూడా ఇదే పని చేసింది. హీరోె నాని  ఈ మధ్య యాక్షన్ సినిమాలపైనే మక్కు వ చూపుతున్నారని,  అందుకే తన దగ్గరకు వచ్చిన  దర్శకుల కథలలో కూడా వేలు పెట్టి  యాక్షన్ సన్నివేశాలు ఉండేలా చూసుకోవాలని వారికి చెబుతున్నాడని…. స్వయాన నానే సదరు మీడాయా చెవిలో చెప్పినట్లు వార్త రాసేశారు.

అంతేకాదు ఆ వార్తను ఏకంగా నానీకే ట్యాగ్ చేశారు. దీనిపై నాని స్పందిస్తూ ‘గౌరవంతో చెబుతున్నా.. ఇలాంటి చెత్త (నాన్‌సెన్స్‌) రాసినప్పుడు కనీసం నన్ను ట్యాగ్‌ చేయకుండా ఉండండి. ఇది నా విన్నపం.. ధన్యవాదాలు’ అని నాని  వాళ్లకు రీ ట్వీట్ చేశాడు. నాని ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.