నాని , సాయిపల్లవి రైడ్… - MicTv.in - Telugu News
mictv telugu

నాని , సాయిపల్లవి రైడ్…

August 30, 2017

నేచురల్ స్టార్ నాని  ‘నిన్నుకోరి ’ సినిమా విజయానందంతో పొంగిపోతున్నాడు. ఓ అమ్మాయితో జాలీగా  బైక్ పై తిరుగుతున్నాడు. నాని ఏదో సరదాకి తిరిగేయటం లేదు… ప్రస్తుతం నాని వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’( మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

షూటింగ్ లో  ఓ సన్నివేశం కోసం ఇలా బైక్ పై చక్కర్లు కొట్టాడు ఈ స్టార్. హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్ పై వెళ్తున్నప్పుడు స్థానికులు నాని, సాయిపల్లవిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. నాని ఎంసీఏతో పాటు ‘ కృష్ణార్జున యుద్దం ’ మూవీలో కూడా నటిస్తున్నాడు.