నారాయణ, చైతన్యలకు భారీ జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ, చైతన్యలకు భారీ జరిమానా

November 29, 2017

‘ చెరసాలల్లో చదువుకుంటున్నట్టుగా తయారయ్యాయి నేటి  ప్రైవేట్ విద్యాసంస్థలు. విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడితో చదవటం అవసరం లేని విద్య ’ అని ఆంధ్రపదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించామని.. తగిన చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు.

‘ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేశాం. రోజుకు 18 గంటల పాటు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇకపై అలాంటివి చెల్లవు.  ఆత్మహత్యల నివారణ కోసం సీఎం స్వయంగా విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేస్తాం. లోటు బడ్జెట్‌లోనూ విద్యారంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దు. ఇది ఒక్క ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతోంది. వాటన్నింటినీ నివారించే దిశగా మా చర్యలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది 100 శాతం నిబంధనలు పాటించే కళాశాలలకే అనుమతిలిస్తాం ’ అని  అన్నారు.