ప్లేటు ఫిరాయించిన ‘మోదీ’.. కాంగ్రెస్ తరఫున ప్రచారం

ఎన్నికల చిత్రాలు అన్నీ ఇన్నీ కాదు. ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో చెప్పడం కష్టం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత తమ్ముడు ఆయనపై కత్తి దూస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ముమ్మూర్తులా మోదీ మాదిరి ఉండే మరొక సెలబ్రిటీ కూడా కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. మొన్నటిదాకా బీజేపీలో ఉండి, ప్రధానికి జైకొట్టిన అభినందన్ పాఠక్ అనే సదరు డూప్ మోదీ ఇప్పుడు హస్తం చూపుతున్నారు.

అభినందన్ ఛత్తీస్‌గడ్‌ ఎన్నికల్లో బస్తర్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మోదీలా ఉండడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన అసలైన మోదీ అని జనం తిడుతున్నారు. అయితే వివరణ ఇచ్చిన తర్వాత నవ్వుకుంటున్నారు. మరికొందరు ఆయన మోదీ కాదని తెలిసిన తిడుతున్నారు.  గత ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు మోదీ తరఫున వకాల్తా పుచ్చుకుని అచ్చే దిన్ వస్తాయని చెప్పావుగా, అవెక్కడ అని నిలదీస్తున్నారు. అలాంటి వారికి ‘ఇక అచ్చేదిన్ రానే రావు.. అవి రావాలంటే ఇక కాంగ్రెస్ కు ఓటెయ్యండి.. ’ అని బతిమాలుతున్నాడు.

ఎందుకు ప్లేటు మార్చానంటే..

తాను ఎందుకు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందో వివరణ కూడా ఇస్తున్నాడు అభినందన్. ‘నరేంద్ర మోదీ అభిమానమే. కానీ బీజేపీ ఆయనను అడ్డుకుంటోంది. మంచిపనులు చేయనివ్వడం లేదు… అందుకు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది.. పార్టీ మారడం సంగతేమోగాని జనంతో నానా తిట్లూ తింటున్నాను. మోదీని అనుకుని శాపాలు పెడుతున్నారు.. ’ అని వాపోయాడు.

telugu news Narendra Modi lookalike, Abhinandan Pathak, campaigns Congress, Chhattisgarh