సావిత్రి సరసన నాగచైతన్య - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రి సరసన నాగచైతన్య

March 23, 2018

సావిత్రి బయోపిక్‌గా వస్తున్న ‘ మహానటి ’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజును సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమధ్యే సినిమా షూటింగ్ దశను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఎవరైతే బాగుంటుంది అని తర్జన భర్జనలు పడ్డాడు దర్శకుడు. ఎట్టకేలకు నాగేశ్వర రావు మనవడు నాగచైతన్య అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలడని భావించి చైతూని సెలెక్ట్ చేసుకున్నాడు.

చైతూ కూడా ఒప్పుకున్నాడు. తాత పాత్రలో బాగా ఒదిగి నటించాడని వినిపిస్తోంది.  ఆయనపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని వార్తలు వచ్చాయి. అది నిజమేననే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఏఎన్నార్ పాత్రను చేసిన చైతూకు నిర్మాత స్వప్నాదత్ కృతజ్ఞతలు తెలియజేసింది.

మొదటినుంచి ఈ సినిమాలోని పాత్రల ఎంపికలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ను ఎంచుకోగా శివాజీ గణేషన్ పాత్రలో దల్కర్ సల్మాన్‌ను ఎంచుకున్నాడు. కాగా ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని తీసుకుంటారనే దానిమీద ఆసక్తి నెలకొని వుంది. డిజిటల్ రూపంలో ఎన్టీఆర్ పాత్ర వుంటుందేమోననే ఊహాగానాలు వినబడుతున్నాయి.