నయీమ్ డబ్బులు ఏమయ్యాయి? 

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతని దగ్గర  దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. గాంధీభవన్లో ఆయన గురువారం విలేకర్లుతో  మాట్లాడారు.  నయీమ్  కేసుపై గతంలో తాను సిట్ అధికారులకు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలును తీసుకోలేదని , తెలంగాణ ప్రభుత్వం కావాలనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని అరోపించారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్రల ఉండటంతోనే ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని వి. హనుమంతరావు ఆరోపించారు.

SHARE