ఎన్టీఆర్ కన్నా ఎన్బీఆరే ఫేమస్ అవుతున్నారు… వర్మ

ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ను ఫేమస్ చేసే క్రమంలో ఆయన కంటే ఎక్కువగా నాదెండ్ల భాస్కరరావు ఫేమస్ అయ్యారని వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్‌ను ఫేమస్ చేసే క్రమంలో.. ఎన్‌బీఆర్ బాగా ఫేమస్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఎన్‌బీఆర్ యూట్యూబ్ వ్యూస్‌ను చూస్తుంటే.. టికెట్ సేల్స్‌ను కూడా దాటి పోతున్నాయి. ఇలా జరుగుతుందని దేవుడు కానీ.. పబ్లిక్ కానీ ఊహించి ఉండరు’ అని తెలిపారు.  వర్మ ట్వీట్‌పై అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు టీడీపీ అనుయాయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ వర్మ ఎవరి మాటనూ పట్టించుకోరు కదా. ఇప్పటికే వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రధారుల ఫోటోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. Telugu news NBR is more famous than NTR … Varma