కుష్ఠు ఉన్నా కలిసి ఉండాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

కుష్ఠు ఉన్నా కలిసి ఉండాల్సిందే

January 8, 2019

జీవిత భాగస్వామికి కుష్ఠు వ్యాధి ఉందనే కారణంతో విడాకులు తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది లోక్‌సభ. ఇందుకు సంబంధించిన ‘పర్సనల్‌ చట్టాల సవరణ బిల్లు-2018’ను సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. హిందూ వివాహచట్టంతో పాటు… ముస్లిం, క్రైస్తవ, ప్రత్యేక వివాహ రద్దు చట్టాలు, హిందూ దత్తత-మనోవర్తి చట్టానికి ఈ సవరణ వర్తించనుంది.Telugu News NDA Government Passes Bill To Remove Leprosy As Ground For Divorce, Owaisi Objects, Calls It Against Islamic Lawఈ బిల్లుపై చర్చ సందర్భంగా న్యాయశాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి మాట్లాడుతూ… ‘కుష్ఠు పూర్తిగా నయమయ్యే వ్యాధి అయినందున ఈ బాధితులను చిన్నచూపు చూడటం, వారి నుంచి విడాకులు కోరడం తగదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మానవహక్కుల కమిషన్‌, న్యాయస్థానాల తీర్పులున్నాయి’ అన్నారు.

అయితే, ఈ బిల్లును మజ్లీస్ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకించారు. మన దేశంలో కుష్ఠు ఇంకా పూర్తిగా నిర్మూలం కాలేదని, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి ముస్లిం దేశాల్లోని కోర్టులు ఈ వ్యాధిని పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేస్తున్నాయని చెప్పారు. ముస్లిం పర్సనల్‌ లా విషయంలో ప్రభుత్వ జోక్యం తగదన్నారు.Telugu News NDA Government Passes Bill To Remove Leprosy As Ground For Divorce, Owaisi Objects, Calls It Against Islamic Law