అమ్మాయికి అర్జున్ రెడ్డి లవ్ రింగ్..

యూత్ ఫేవరేట్ స్టార్ విజయ్ దేవరకొండ అమ్మాయితో బుల్లెట్ మీద షికారుకెళ్ళాడు. ఆమెను జోకొట్టాడు, కలసి ఆడుకున్నాడు, తిరిగాడు. చివరికి సముద్రం దగ్గరికెళ్లి ఆమెకు రింగ్ కానుకగా ఇచ్చి, మోకాలి మీద కూర్చుని  లవ్ ప్రపోజ్ చేశాడు!

ఇదంతా నిజమే అనుకుంటున్నారా? తనకు ఓ అమ్మాయి బాగా క్లోజ్ అని, వివరాలు తర్వాత చెప్తానని అర్జున్ రెడ్డి చెప్పడం తెలిసిందే. అందుకే నిజం అనుకునే అవకాశముంది. కానీ రింగ్ తతంగమంతా ఓ వీడియో ఆల్బమ్ కోసం చేశాడు అర్జున్ రెడ్డి.

నీ వెనకాలే నడిచి.. అనే పాట ఆల్బమ్లో నటించాడు విజయ్. మంచి ఫీలున్న రొమాంటిక్ సాంగ్ ఇది. చక్కని లొకేషన్లలో అందంగా, ఆహ్లాదంగా సాగుతుంది పాట. విజయ్ ప్రేయసిగా మలోబికా బెనర్జీ కనిపించారు. తాజాగా విడుదలైన ఈపాట చాలా బాగుందని అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశాడు. భానుశ్రీ తేజ పాటను అందంగా తెరకెక్కించారు. నీ వెనకాలే నడిచా.. సూపర్గా ఉంది అని పేర్కొన్నాడు.

పాట ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం ఒక్క రోజులోనే 7 లక్షల మందికి పైగా చూశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్ ట్రెండింగ్లో ఐదో స్థానంలో ఉంది. పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆలపించగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. విజయ్ ఇటీవల ‘టాక్సీవాలా’ సినిమాతో హిట్టందుకుని మంచి ఊపు మీదున్నాడు. అటు సినిమాలతో ఇటు మధ్యమధ్యలో ఇలాంటి కూల్ సాంగ్స్‌తో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఉల్లాసపరుస్తున్నాడు.

Telugu news Nee Venakale Nadichi Music Video  Vijay Devarakonda  Malobika | Chinmayi  TrendMusic