mictv telugu

పురిటి నొప్పులను భరించి పరీక్ష రాసిన గర్భిణీ..

January 4, 2019

 ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సాధించాలనే పట్టుదల, తపన ఒక గర్భిణిని పురుటినొప్పులను దిగమింగేలా చేసింది. పరీక్షకు ముందుగానే నొప్పులు వచ్చే లక్షణాలు కనిపించినా విషయాన్ని కూడా పరీక్షా రాయడం కోసం కుటుంబసభ్యులకు తెలియనివ్వలేదు. పైకి నవ్వుతూ పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా నొప్పులు ఎక్కువైనా కూడా… అలాగే పరీక్ష పూర్తిచేసి చివరలో స్పృహ కోల్పోయింది. ఈ హృదయవిదారక సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెంలో గురువారం చోటుచేసుకుంది.

Telugu news nellore married women write the government job exam with pregnancy pains .

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కావలి మండలం తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన థన్యాసి స్వాతి, మహేష్‌లు నిరుపేద దంపతులు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న మహేష్‌ రెక్కాడితే కానీ డొక్కాడని దుస్థితి. దీంతో తన భార్య స్వాతిని ఆయన చదువులో చాలా ప్రోత్సహించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ కళాశాలలో బీఈడీ చదివించాడు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం శిక్షణ కూడా ఇప్పించాడు. డీఎస్సీ పరీక్ష కోసం ఆమె కష్టపడి చదివింది కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో. డీఎస్సీ పరీక్ష గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉండడంతో భర్తతో పాటు ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా స్వాతికి పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయినా కూడా బాధను దిగమింగి పరీక్ష రాసింది. పరీక్ష పూర్తైన వెంటనే ఆ పేపర్‌లను ఇన్విజిలేటర్‌కు ఇచ్చి స్పృహ కోల్పోయింది. కళాశాల ఛైర్మన్‌ పెనుబల్లి బాబునాయుడుకు విషయం తెలియడంతో తన కారులో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలసుబ్రమణ్యం, నాగచైతన్య ఆమెకు కాన్పు చేయగా.. పండంటి మగబిడ్డ జన్మించాడు.

Telugu news nellore married women write the government job exam with pregnancy pains