భూమి కోసం అత్తను చంపిన అల్లుడు - MicTv.in - Telugu News
mictv telugu

భూమి కోసం అత్తను చంపిన అల్లుడు

April 19, 2018

భూమి కోసం వరుసకు అల్లుడేయ్యే ఓ వ్యక్తి  ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. ఆమె తలపై ఇనుప రాడ్డుతో మోది అతి కిరాతకంగా చంపేశాడు.  ఆధారాలు దొరక్కుండా పక్కా ప్రణాళికతో హత్య చేసి,చివరికి పోలీసులకు చిక్కాడు.నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సీఐ తెలిపిన వివరాల ప్రకారం… గత నెల 17న నరుకూరులో వేగూరి పద్మమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న సీఐకి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేకుండా పకడ్బందీగా పథకం ప్రకారం హత్య చేశారు. అనుమానితులు,బంధువులను విచారించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.ఆనంతరం టవర్ డంప్ ఆధారంగా కేసును వేగవంతం చేశారు

హత్య జరిగిన ప్రాంతంలో పూనమల్లి శ్రీనివాసులు ఫోనులో మాట్లాడినట్లు, అక్కడ మరో కొత్త ఫోనులో నంబరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూ వివాదం కారణంతోనే పద్మమ్మను హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు. ఈ మేరకు పూనమల్లి శ్రీనివాసులతో పాటు తమ్ముడు సురేంద్ర, వేగూరు శ్రీహరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు.