పెద్దలు ప్రేమను అంగీకరించారు.. కానీ గ్రామస్థులే - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దలు ప్రేమను అంగీకరించారు.. కానీ గ్రామస్థులే

March 5, 2018

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమజంటను కుటుంబ పెద్దలు వారి  ప్రేమను అర్థం చేసుకొని అంగీకరించారు. కానీ గ్రామ పెద్దలు మాత్రం కోపంతో ప్రేమజంటపై దారుణంగా ప్రవర్తించారు.కొత్త దంపతుల చేత మోకాళ్లు అరిగేలా గుంజీలు తీయించారు. వారిచేత అక్కడి నేలపై ఉమ్మి వేయించారు. రూ. 11 వేల చొప్పున జరిమానా కట్టాలని తీర్పిచ్చారు. ఈ సంఘటన బీహార్‌లోని సుఫౌల్‌లో జరిగింది.నేపాల్‌కు చెందిన మౌరానా, బడ్ హరా సమీపంలోని తన తాతయ్య ఇంట్లో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన సంజీత్ కుమార్ ఆమెను ప్రేమించాడు.పెద్దలకు తెలియకుండా ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. కానీ  గ్రామ పెద్దలు మాత్రం ఆ జంట మీద కోపంతో క్రూరంగా హింసించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.