బలవంతంగా ముద్దు పెట్టాడు.... - MicTv.in - Telugu News
mictv telugu

బలవంతంగా ముద్దు పెట్టాడు….

February 23, 2018

మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పోకిరీలు రెచ్చిపోతునే ఉన్నారు. పోలీసులు ఎంత గస్తీ కాస్తున్న కూడా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఓ యువతిని ఓ ఆకతాయి వేధింపులకు గురి చేశాడు.నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్‌‌లో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.బలవంతంగా  ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఆ వ్యక్తి తనను స్టేషన్‌ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు కాసేపటికే సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతని పేరు నరేష్‌ కే జోషి(43)గా తేలింది.  ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే కొందరు ఉన్నప్పటికీ తమకేం పట్టనట్లు ఉండటం గమనార్హం.