హీరో ఎక్స్‌పల్స్ బైక్ వచ్చేస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

హీరో ఎక్స్‌పల్స్ బైక్ వచ్చేస్తోంది

November 25, 2017

హీరో కంపెనీ నుంచి మరో కొత్త బైక్ రాబోతోెంది. హీరో ఎక్స్ పల్స్ అడ్వెంచర్ పేరుతో 2018 జూన్ , జూలైలో ఇండియా రోడ్లపై పరుగులు పెట్టబోతోంది. ఈ బైకును ఇండియన్ మార్కెట్లోకి తీసుకు రావడానికి యూరప్‌లో జరిగిన ఈఐసిఎంఎ మోటార్ సైకిల్ షోలో నిర్వాహకులు చెప్పారు.

హీరో నుంచి వస్తున్న సరికొత్త అడ్వెంచర్ బైకు ఇదేనట. 200 సిసి, సింగిల్ సిలెండర్, ఎయిర్ కూలుడ్ ఇంజన్ తో ఈ బైకును రూపొందిస్తున్నట్లు  నిర్వాహకులు తెలిపారు. దీని ధర లక్షా పదివేలనుంచి, లక్షా ఇరవై వేల వరకు  ఉంటుందని సమాచారం.