లగ్జరీ కారు కొన్న ఆనందం 10 నిమిషాలైనా లేదు పాపం! - MicTv.in - Telugu News
mictv telugu

లగ్జరీ కారు కొన్న ఆనందం 10 నిమిషాలైనా లేదు పాపం!

March 12, 2018

ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి  లగ్జరీ కారు కొన్నాడు. కానీ అతనికి కొత్త కారు సంబురం 10 నిమిషాలైనా లేదు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని 30 రోజులపాటు  ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ అతను చేసిస తప్పేంటో తెలుసా? 40 కిలోమీట్లర్ల వేగంతో వెళ్లాల్సిన రోడ్డుపై ..కొత్త కారు అనే జోష్ లో ఏకంగా 100 కిలో మీటర్ల వేగంతో వెళ్లాడు. అంతేకాదు తన మొదటిసారిగా ఆ కారు నడిపిన అనుభవం గుర్తుండి పోవాలని  ఓ వైపు డ్రైవ్ చేస్తూ వీడియో కూడా తీసుకున్నాడు. ఇక పోలీసులు ఊరుకుంటారా? అతన్ని వెంబడించి మరీ కారును ఆపి స్వాధీనం చేసుకున్నారు.అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అవడంతో ‘పాపం కొత్త కారు కొన్న ముచ్చట తీరకుండానే అతని కారు  పోలీసుల పాలైందే పాపం’ అని కామెంట్లు పెడుతున్నారు.