సిగ్నల్ బటన్‌‌‌ను ఇక మీరే నొక్కొచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

సిగ్నల్ బటన్‌‌‌ను ఇక మీరే నొక్కొచ్చు!

March 16, 2018

ప్రధాన నగరాల్లో రోడ్డు దాటటడం అంటే  దాదాపు కదనరంగంలో దూకినట్టే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడు వచ్చి  గుద్దుతాడో తెలీదు. ఆకుపచ్చ సిగ్నల్ పడడమే ఆలస్యం రయ్యు రయ్యు మంటూ కూడళ్ల దగ్గర  వాహనాలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అయితే అలా పరుగులు పెట్టే వాహనాలను ఆపే మంత్రదండం మీ చేతుల్లోనే ఉంటే…అదే ఆలోచన చేశారు. ముంబై అధికారులు.  రద్దీగా ఉంటే కూడళ్లలో స్నిగ్నల్స్ ను ఎవ్వరైనా ఆపరేట్ చేేసే బటన్ ను పెట్టారు. ఒకవేళ ఎవరైనా రోెడ్డు దాటాలంటే పక్కనే స్థంబానికున్న మీట నొక్కితే  చాలు రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. పిల్లల స్కూల్ దగ్గరలో ఉండే కూడళ్ల దగ్గర రద్దీగా ఉండే సిగ్నల్స్ దగ్గర వీటిని ఏర్పాటు చేశారు అధికారులు.వృద్దులు, పిల్లలు , వికలాంగులు, గర్భిణి స్త్రీలు రోడ్డు దాటాలంటే ఈ సౌకర్యం వారికి బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు అధికారులు.  ముంబైలో ట్రాఫిక్ గురించి అందరికీ తెలసిందే. కొందరి జీవితాలు రోడ్ల మీదే తెల్లారుతాయి అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అధికారులు చేసిన ఈ ఆలోచనలో రాత్రిళ్లు రోడ్డు దాటే వారికి  మరియు పిల్లలు,వృద్దులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.