పోస్ట్‌మెన్, ఉమెన్లకు ఇక ఖాదీ బట్టలు! - MicTv.in - Telugu News
mictv telugu

పోస్ట్‌మెన్, ఉమెన్లకు ఇక ఖాదీ బట్టలు!

January 30, 2018

ఇంటింటికీ తిరిగి ఉత్తరాలు, మనియార్డర్లు పంచే పోస్ట్‌మెన్లు  ఏ డ్రెస్ వేసుకుంటారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వాళ్లకు కొత్త డ్రెస్సులు వచ్చాయి. కలర్ మాత్రం ఖాకీనే కానీ ఖాదీ డ్రెస్సులు వేసుకోబోతున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 90 వేల మంది  పోస్ట్ మెన్, ఉమెన్స్ ఇకనుంచి ఖాదీ డ్రెస్సులే వేసుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

అంతేకాదు పోస్ట్ మెన్, ఉమెన్ వేసుకోవాల్సిన  ఖాదీ డ్రెస్సులను విడుదల చేశారు. ఫిబ్రవరి1 నుంచి అందరూ ఇవే డ్రెస్సులు వేసుకోవాలని ఆయన అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రెస్సులను ప్రభుత్వమే వారికి అందజేయనుంది.

పోస్టుమెన్స్‌కు రెండు జతల బట్టలు(రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్) పోస్టుఉమెన్స్‌కు రెండు జతల సల్వార్ – కమీజ్ అందజేయనున్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం(కేవీఐసీ)కు ఈ డ్రెస్సుల కోసం  రూ. 48 కోట్ల ఆర్డర్స్ ఇచ్చినట్లు  పోస్టల్ కు సంబంధించిన  అధికారి తెలిపారు.