వాట్సాప్‌లో అలాంటి మెసేజీలకు చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో అలాంటి మెసేజీలకు చెక్

February 28, 2018

ఎవరో రాసినదాన్ని కాపీ కొట్టి దాన్ని ఎంచక్కా తాము రాసినట్టు కలరిస్తూ వాట్సాప్‌లో పేస్ట్ చేస్తుంటారు. అలాంటి కాపీ రాయుళ్ళ పని పట్టడానికి వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌తో రానుంది.  అదే ‘ ఫార్వర్డెడ్‌ మెసేజ్ ‘  అనే ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా వేరే వ్యక్తులు స్పామ్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌  చేసినా లేదా ఒకే చాట్‌ నుంచి ఆ పోస్టు ఫార్వర్డ్‌ అయినా ‘ ఫార్వర్డెడ్‌ మెసేజ్‌ ‘ అనే టాగ్‌ వచ్చేస్తుంది.

చాలా మంది ఎఫ్‌బీ, ట్విటర్‌లలోంచి రాతలను మక్కీ టు మక్కీ కాపీ కొట్టేస్తూ వాట్సాప్‌కు పంపించేసి మేథావుల్లా కలరిస్తుంటారు. అలాంటివాళ్ళ రంగులను బట్టబయలు చేయనుంది ఈ సరికొత్త ఫీచర్. స్పామ్‌ పోస్టులను పదే పదే పంపిస్తూ.. యూజర్లను విసుగెత్తిస్తూ ఉంటారు. ఇకనుండి యూజర్లకు ఆ విసుగు వుండదన్నమాట. ప్రస్తుతం వాట్సాప్‌, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే కానీ మెసేజ్‌ను బ్లాక్‌ చేయలేదు. దీంతో స్పామ్‌ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్‌ అవుతూ ఉన్నాయి. 

వాట్సాప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. దీంతో పాటు స్టికర్స్‌ ఫీచర్‌ కూడా విండోస్‌ ఫోన్‌ బీటాపై స్పాట్‌ అయింది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది.