తెలంగాణలో మరో 28 మునిసిపాలిటీలు ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మరో 28 మునిసిపాలిటీలు !

February 1, 2018

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం  జీహెచ్ఎంసీతో పాటు మొత్తం 73 పురపాలక సంఘాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరో  28 మునిసిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. 199 శివారు గ్రామ పంచాయితీలను ప్రస్తుతం ఉన్న పురపాలికల్లో కలపాలని  పలు జిల్లాల నుంచి  తెలంగాణ సర్కార్‌కు ప్రతిపాదనలు వచ్చాయి.

మొత్తం 52 గ్రామపంచాయితీలను మునిసిపాలిటీల్లో కలిపి  28 కొత్త పురపాలకాలను ఏర్పాటు చేయాలని  యోచిస్తున్నారు. 15 వేల జనాభా మించితే  అది పురపాలికే అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీల చుట్టు ఒకటి నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామపంచాయితీలను  దగ్గరలోని మునిసిపాటీలలో కలపబోతున్నారు.

ఆగస్ట్ తర్వాత ఈ కొత్త మునిసిపాలిటీలు ప్రారంభం కానున్నాయి.ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం సంబంధిత గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఆయా గ్రామ పంచాయతీలను కొత్త నగర పంచా యతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ, శివారు పురపాలికల్లో  విలీనం చేస్తున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 5 పురపాలికల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి.