అపచారం.. బాత్రూం గోడలపై హిందూ దైవాలు

భారతీయ సంస్కృతీసంప్రదాయాలకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో అత్యధికంగా 80% ప్రజలు హిందూ మతస్తులు. అయినా ఈ సంగతిని పాశ్చాత్య దేశాలు అంతగా పట్టించుకోవు. వారి మనోభావాలను అసలు లెక్క చేయవు.

 ప్రచారం కోసం చేయరాని పనులు చేస్తుంటాయి. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని హౌస్ ఆఫ్ ఎస్ అనే పబ్ నిర్వాహకులు అత్యుత్సాహం చూపించారు. పబ్‌లోని వీఐపీ బాత్రూం గోడలపై హిందూ మాత దేవతలు అయినా వినాయకుడు, సరస్వతి, శివుడు, కాళీ చిత్రాలను పెయింట్ చేశారు. అది కూడా కక్కసు వద్ద పెట్టడం మరీ దారుణానికి తెగబడ్డారు.  తెలిసి కావాలని చేసారో లేదా తెలియక చేసారో తెలియదు కానీ కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.

అంకితా మిశ్రా అనే భారతీయ సంతతికి చెందిన మహిళ ఈ దుర్మార్గాన్ని చూసి చలించి పోయింది. తన మాతృదేశ ఆత్మ గౌరవం మంటకలిసిపోవడం ఇష్టంలేని ఆమె ఆ పబ్ నిర్వాహకులకు ఒక మెయిల్ రాసి చురకలు అంటించింది. వెంటనే అంకిత మెయిల్‌కు స్పందించిన పబ్ నిర్వాహకులు ఆమెకు క్షమాపణలు చెప్పి ఆ చిత్రాలనే వెంటనే తొలగిస్తామని హామీఇచ్చారు.

Telugu News New York Based House of Yes pub paints Hindu gods on bathroom walls