బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన న్యూయార్క్ - MicTv.in - Telugu News
mictv telugu

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన న్యూయార్క్

December 11, 2017

అమెరికా మరోమారు బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌ ప్రాంతం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఇది ఉగ్రదాడా.. మరొకటా అనేది తెలియాల్సి వుంది.

మాన్‌హట్టన్‌ పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్‌ వద్ద ఈ ఘటన జరగడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికాలో అతిపెద్ద పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్‌ ఇదే. వెంటనే తేరుకున్న అక్కడి పరిసర ప్రాంతాల ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలంలో అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. చెవుల్లోని హెడ్‌ఫోన్స్ దద్దరిల్లిపోయేలా పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.