ప్రియాంకను వాడుకుని వదిలేద్దామనుకున్నాడు కానీ ఆ జాణ.. న్యూయార్క్ టైమ్స్

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే.. ఏదో అన్నాడని సామెత. చక్కగా పెళ్లిచేసుకున్న బాలీవుడ్ తార ప్రియాంకా చోప్రా, అమెరికా పాప్ గాయకుడు నిక్ జోనాస్ జంటను అందరూ శీఘ్రమేవ అని దీవిస్తోంటే న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాత్రం తిట్లకు లంకించుకుంది.

York Mag Article Calls Priyanka Chopra 'Global Scam Artist

ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని, జోనాస్‌ను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఓ వ్యాసంలో గగ్గోలు పెట్టింది. ఆమె కుట్రప్రకారం అతణ్ణి ముగ్గులోకి దించి, పెళ్లి పేరుతో జీవితకాల శిక్ష వేసిందని విమర్శించింది. ‘ వాళ్ల ప్రేమ నిజమేనా? పాపం నిక్.. అతడు అందరు కుర్రాళ్లలాగే ఆ వగలాడిని తాత్కాలిక కాలక్షేపంగా ప్రేమయాణం సాగించి, వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ నెరజాణ పెళ్లిపేరుతో అతణ్ని శాశ్వతంగా కట్టేసుకుంది..’ అని వాపోయింది.

ఈ విమర్శలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీని వెనుక జాతి వివక్ష ఉందని, ఒక ఆసియా మహిళ అమెరికా సినీ, టీవీ రంగాల్లో జీర్ణించుకోలేక విషం కక్కారని మండిపడుతున్నారు. మరోపక్క.. భారత దేశంలోనూ కొందరు అమ్మలక్కలు, అన్నతమ్ముళ్లు గుసగుసలు పోతున్నారు. వయసులో పదేళ్ల కంటే తక్కవైనా కుర్రాణ్ని చేసుకోవడం బాగాలేదని అంటున్నారు.  

Telugu news new York Mag Article Calls Priyanka Chopra ‘Global Scam Artist’ for Marrying Nick Jonas “Nicholas Jonas married into a fraudulent relationship (with Priyanka Chopra) against his will this past Saturday, December the 1st, and I’ll tell you why,” the article published by The Cut reads.