సముద్రంలో వింత జీవి.. పొడవు ఎంతంటే..

సముద్ర గర్భంలో మనిషి కనుగొనని ఎంతో జీవరాశులు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. సెయిలర్లకు కొత్త కొత్త జీవులు తారసపడుతూ శాస్త్రవేత్తల మాటలను నిజం చేస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ దీవుల్లో కూడా ఇలాంటి ఒక వింత జీవి ప్రత్యక్షమైనది. సముద్రం లోపల నీటిలో తేలియాడుతున్న 26 అడుగుల పొడవైన తెల్లని పాములాంటి వింత జలచరాన్నిస్టీవ్ హథవే, ఆండ్రూ బటిల్‌ అనే ఇద్దరు డైవర్లు  గుర్తించారు. చూసిన వెంటనే భయానికి గురయ్యారుగాని, ఆ తర్వాత మెల్లగా దాని దగ్గరకు వెళ్లారు.

వైట్‌ ఐలాండ్‌ అనే ఓ చిన్న అగ్నిపర్వతప్రాంత  దీవిలో అక్టోబర్‌‌ 25న స్టీవ్‌ హాథవే ఈ వింతజీవిని తన కెమెరాలో బంధించారు. ఆ జీవి తన రూపురేఖలను మార్చుకుంటూ నీటిలో మెల్లగా కదులుతోంది. దీన్ని పైరోసోమ్స్‌‌ అని పిలుస్తారట. వేలాది జీలచరాలు ఒకటిగా కలిసి ఇలా పైరోసోమ్‌గా ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 19 శతాబ్దంలో కొందరు సెయిలర్లు వీటిని గుర్తించారు. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో ఉండే పైరోసోమ్స్ 45 నుంచి 60 అడుగుల వరకు పొడవు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Telugu News new Zealand divers found mysterious sea species