కొన్ని వారాల్లో యుగాంతం!  - MicTv.in - Telugu News
mictv telugu

కొన్ని వారాల్లో యుగాంతం! 

August 30, 2017

మీకు 2012 డిసెంబర్ 21వ  తేదీ గుర్తుంది కదా..  ఆ రోజు భూమి నాశనమైపోతుందని జనం హడలిచచ్చారు. మాయాన్  కేలండర్ ప్రకారం ఆ తేదీన యుగాంతం అవుతుందని,  భూమిపై ఇక జీవరాశి ఉండదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తర్వాత అదంతా ఉత్తదని తేలడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ  ఇలాంటి ఓ వార్త జనానికి దడ పుట్టిస్తోంది.

కొద్ది వారాలో భూగ్రహం నాశనం అవుతుందని డేవిడ్ మీడ్ అనే క్రైస్తవ న్యూమరాలజిస్ట్ హెచ్చరిస్తున్నాడు.  సౌర కుంటుంబం బయట ఉన్న ప్లానెట్ ఎక్స్ లేదా నిబిరు అనే గ్రహం  భూమిని ఢీకొట్టనుందని ఆయన కచ్చితంగా లెక్కలేసి చెబుతున్నాడు. సెప్టెంబర్ 20-23 తే మధ్య భూమికి వినాశనం తప్పదని అంటున్నాడు.

డేవిడ్.. ‘ప్లానెట్ ఎక్స్ : ద 2017 అరైవల్’ అనే పుస్తకం రాశాడు.  రాబోయే యుగాంతం గురించి బైబిల్ తోపాటు ఈజిప్టు  పిరమిడ్స్ పైనా రాసి ఉందని చెబుతున్నాడు. ప్లానెట్ ఎక్స్ ఢీకొనడం వల్ల సునీమీలు, భూకంపాలు సంభవిస్తాయని, ఫలితంగా భూమి కాలగర్భంలో కలసిపోతుందని అంటున్నాడు.

30 సంవత్సరాల కిందటే  ప్లానెట్ ఎక్స్ ను   నాసా గుర్తించింది.  ఇది సౌర కుంటుంబంలోని అతి పెద్ద గ్రహమైన గురు గ్రహం కంటే చాలా పెద్దదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం నేరుగా వచ్చి భూమిని ఢీకొడితే పూర్తిగా వినాశనమేని డేవిడ్ అంటున్నాడు. ఇది భూమి పక్క నుంచి వెళ్లినా కూడా డేంజరేనని, దాని గుర్వత్వాకర్షణ శక్తి..  భూమిని తన కక్ష నుంచి దూరంగా విసిరేసే ప్రమాదం ఉందని భయపెడుతున్నాడు.

సెప్టెంబర్ రెండో వారం నుంచే మనకు ఆకాశంలో ప్లానెట్ ఎక్స్ కనిపిస్తుందని కూడా డేవిడ్ చెబుతున్నాడు. కాని సైంటిస్టులు మాత్రం ఇది నిజం కాదని కొట్టి  పారేస్తున్నారు.

Test: Keys = MictvKramelakam