కాబోయే అల్లుడి కులమతాలతో పనిలేదు.. నాగబాబు - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే అల్లుడి కులమతాలతో పనిలేదు.. నాగబాబు

February 11, 2019

మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కూతురు నిహారిక వివాహంపై మెగాబ్రదర్ నాగాబాబు స్పందించారు. త్వరలోనే నిహారికకు పెళ్లి జరుగుతుందని, మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూతురు వివాహం గురించి పలు విషయాలు వెల్లడించారు

‘నిహారికకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబలోని అందరూ నటులే కదా. అందుకే తనకు కూడా నటించాలని ఉంటుంది. కానీ నిహారిక నటించిన ‘ఒక మనసు’ సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత తమిళంలో నటించింది. అది ఫర్వాలేదు అనిపించింది. మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ అదీ పెద్దగా ఆడలేదు. సినిమాలు చేస్తూనే ‘ముద్దపప్పు’ వెబ్ సిరీస్ లో నటించింది. అది చాలా సక్సెస్ అయ్యింది.

Telugu News Niharika Get Marriage Soon Says Mega Brother Nagababu.

తాజాగా ‘సూర్యాకాంతం’ అనే సినిమా చేస్తోంది. ఆడపిల్ల కదా నటనకు పంపాలా? వద్దా? అనుకుంటున్నప్పుడు తానే నేను నటిస్తా నాన్నా. మంచి కథలు ఎంచుకుంటాను అంది. నేను దానికి ఓకే చెప్పేశాను. కానీ మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తానమ్మా అంటే సరేనంది. 2018 వరకు నిహారికకు టైమ్ ఇచ్చాను. 2019 వచ్చింది. సంబంధాలు చూస్తున్నాం. సినీ రంగం నుంచే కావాలని ఏమీ లేదు. మంచి గుణం, పద్దతైన కుర్రాడు అయితే చాలు. నాకు కులం, మతంతో పెద్ద పట్టింపులు కూడా లేవు. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా’ అని నాగబాబు పేర్కొన్నారు. Telugu News Niharika Get Marriage Soon Says Mega Brother Nagababu