అల్లరోడి ట్రైలర్ ఆదిరింది… - MicTv.in - Telugu News
mictv telugu

అల్లరోడి ట్రైలర్ ఆదిరింది…

August 27, 2017

అల్లరి నరేష్ తన కామెబాతో ప్రేక్షకుల పొట్టలను నవ్వులతో పగలగొడతాడు. ఏమైందేమోగాని ఈ మధ్య అంతగా అలరించలేకపోతున్నాడు. తాజాగా ఇప్పుడు తన ‘మేడ మీద అబ్బాయి’పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 8న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

నరేష్ ఎప్పటిలా అదిరిపోగా, జబర్థస్త్ ఆది, సత్యం రాజేష్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ‘మేడ మీద అబ్బాయి’ మలయాల మూవీ ‘ఒరు వడక్కన్’ సెల్ఫీ రీమేక్ ప్రజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నరేష్ కు 53వది కాగా ఈ మూవీలో నిఖిల్ విమల్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నప్పటీకి ఈ మూవీ రిలీజ్ రోజే నాగచైతన్య ‘యుద్దం శరణం’ మూవీ కూడా విడుదల కానుంది. ఈ రెండు మూవీల మధ్య బిగ్ ఫైట్ ఉంటుదని అంటున్నారు సినీ వర్గాలు.