బ్యాంకులే నాకు టోపీ పెట్టాయి.. అప్పులు కట్టలేను.. నీరవ్ మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకులే నాకు టోపీ పెట్టాయి.. అప్పులు కట్టలేను.. నీరవ్ మోదీ

February 20, 2018

గత కొన్ని రోజులుగా నీరవ్ మోదీ  పేరు వినే ఉంటారు.  ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11400  కోట్ల రూపాయలను  ఎగ్గొట్టి  విదేశాలకు చెక్కేశాడని రోజుకో వార్త వస్తూనే ఉంది. అయితే  విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీ  బ్యాంకు మేనేజ్‌మెంట్‌కు ఓ లేఖ రాశారు.

‘పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను  నేను ముంచడం కాదు. పంజాబ్ నేషనల్ బ్యాంకే  నన్ను అడ్డంగా బుక్ చేసింది. అసలు నాకు రూ.11400 కోట్ల అప్పే లేదు. బకాయిలన్నీ కలుపుకున్నా రూ.5 వేల కోట్లు దాటవు. తన సంస్థల బ్రాండ్ ఇమేజ్‌తో పాటు స్థిర, చర ఆస్థుల మార్కెట్ విలువ 6,500 కోట్ల వరకు ఉంటుంది. అన్ని అమ్మి మెల్లెగా అప్పులు కడదామని అనుకున్నాను.

కానీ ఎలాగైనా అప్పులు వసూలు చేయాలన్న ఆతృతతో పంజాబ్ నేషనల్ బ్యాంక్  నామీద, నాకుటుంబంమీద  క్రిమినల్ కేసులు పెట్టింది. అందుకే నేను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బ్యాంకు చేసిన పనికి  నా పలుకుబడి మొత్తం పోయింది. ఇప్పుడు నాకున్న అన్నిదారులు మూసుకుపోయాయి.’ బ్యాంక్ మేనేజ్ మెంట్ కు లేఖ రాశాడు.  బ్యాంకుకు 11400 కోట్ల రూపాలు ఎగ్గొట్టిన  అనే నింద పడ్డ నీరవ్  తన ఖాతాలో ఉన్న  కొంత డబ్బుతో ..తన వ్యాపార సంస్థల్లో పనిచేసే 2200 మంది ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చేశాడట. ఈవిషయాన్ని కూడా ఆయన లేఖలో రాశాడు.